BREAKING
దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్ డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం. ఈ నెల 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి చారిత్రక క్లాక్ టవర్లు, ఢిల్లీ 900 స్లేవ్స్ వెనుక ఉన్న రహస్యాలు: భారత కాల రక్షకులపై ఆసక్తికర పుస్తకం అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ మెట్రో సత్తా: బెర్లిన్ ఇన్నోట్రాన్స్ 2026 ప్రదర్శనలో డీఎంఐఎల్ అరంగేట్రం ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని 2028-29 నాటికి పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం హమీద్ అన్సారీ, రాహుల్ గాంధీలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని

Select Suryaa Now
ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని

 ప్రజల కోసం పనిచేసే ప్రజా నేత ఇరిగినేని

- ఇరిగినేని తిరుపతి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళులు

- మోపాడు ఘాట్‌, బొట్లగూడూరు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్‌రావు

పామూరు, మేజర్ న్యూస్ : 

కనిగిరి మాజీ ఎమ్మెల్యే, దివంగత ఇరిగినేని తిరుపతి నాయుడు 88 జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్‌రావు మోపాడు గ్రామంలోని ఇరిగినేని తిరుపతి నాయుడు ఘాట్‌పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొట్లగూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇరిగినేని తిరుపతి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఇరిగినేని తిరుపతి నాయుడు రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసిన ఇరిగినేని తిరుపతి నాయుడు ఆశయాలు, సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఇరిగినేని రవీంద్రబాబు,పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, యారవ శ్రీనివాసులు,పువ్వాడి వెంకటేశ్వర్లు (బిల్డర్), పువ్వాడి రామారావు, అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, ఉప్పుగండ్ల రమేష్, మార్నేని రామకృష్ణ, మల్లెబోయిన బాల బ్రహ్మయ్య యాదవ్, తెల్లజాల ప్రసాద్, గుర్రం వెంకటేశ్వర్లు, దారపనేని సుబ్బారావు, కోటపాటి నరసింహారావు, ఏలూరి మాధవరావు, దయిండే శివశంకర్, షేక్ గౌస్ బాషా, మోరుబోయిన నరసింహారావు, ఆరెకొండ హరిప్రసాద్, మెడ బలిమి వెంకట్రావు, వింజం కొండయ్య తదితరులు పాల్గొన్నారు.