BREAKING
దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్ డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం. ఈ నెల 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి చారిత్రక క్లాక్ టవర్లు, ఢిల్లీ 900 స్లేవ్స్ వెనుక ఉన్న రహస్యాలు: భారత కాల రక్షకులపై ఆసక్తికర పుస్తకం అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ మెట్రో సత్తా: బెర్లిన్ ఇన్నోట్రాన్స్ 2026 ప్రదర్శనలో డీఎంఐఎల్ అరంగేట్రం ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని 2028-29 నాటికి పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం హమీద్ అన్సారీ, రాహుల్ గాంధీలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం

Select Suryaa Now
టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం

టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం

- యాదాల సాయి కిరణ్ నేతృత్వంలో వైసీపీని వీడి టీడీపీలోకి 100 కుటుంబాలు
- స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి
- టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర 

పామూరు, మేజర్ న్యూస్ :  తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పామూరు పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పామూరు మేజర్ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్ నేతృత్వంలో వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్ అల్లూరి రాగమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఉగ్ర టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ టీడీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాయి కిరణ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కుటుంబాలు టీడీపీలో చేరడం పట్ల ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు, ఇరిగినేని రవీంద్ర, మాజీ ఉపసర్పంచ్  యాదాల వెంకట సాయి కిరణ్, పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, యారవ శ్రీనివాసులు, అడుసుమల్లి ప్రభాకర్, గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, మల్లెబోయిన బాల బ్రహ్మయ్య, ఉప్పలపాటి హరిబాబు, పాలపర్తి వెంకటేశ్వర్లు, మోరుబోయిన నరసింహారావు, బైరెడ్డి జయరామిరెడ్డి, సయ్యద్ అమీర్ బాబు, షేక్ గౌస్ బాషా, చల్లా సుబ్బారావు, ఉసా మధు తదితరులు పాల్గొన్నారు.