BREAKING
అంతర్జాతీయ వేదికపై గిన్నిస్ బుక్ హోల్డర్ గంటా జిష్ణు ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్ కోనసీమలో భారీ విస్ఫోటనం... ధ్వంసమైన ఇల్లు.. యువకుడికి తీవ్ర గాయాలు.. జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్ డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం. ఈ నెల 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి చారిత్రక క్లాక్ టవర్లు, ఢిల్లీ 900 స్లేవ్స్ వెనుక ఉన్న రహస్యాలు: భారత కాల రక్షకులపై ఆసక్తికర పుస్తకం అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ మెట్రో సత్తా: బెర్లిన్ ఇన్నోట్రాన్స్ 2026 ప్రదర్శనలో డీఎంఐఎల్ అరంగేట్రం ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని 2028-29 నాటికి పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం

డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం

Select Suryaa Now
డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం

మంగళగిరి, సెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాయలసీమ జెన్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమరావతి 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన రాయలసీమ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన అమరావతి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ రంగ లక్ష్మి 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, అనూష 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేసింది. వన్‌డౌన్‌గా వచ్చిన కాట్రగడ్డ దీక్ష కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచింది. ఈ ప్రదర్శనకు ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. గ్రీష్మ 39, శుభశ్రీ 22 పరుగులు చేశారు. అమరావతి బౌలర్లలో సాయి పూజిత 4 వికెట్లు, కాండ్రేగుల దేవిక 2 వికెట్లు పడగొట్టగా, సాయి దీప్తి, జోషి చెరో వికెట్ తీశారు. దీంతో అమరావతి 7 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో రెండో గెలుపును నమోదు చేసింది.