BREAKING
అంతర్జాతీయ వేదికపై గిన్నిస్ బుక్ హోల్డర్ గంటా జిష్ణు ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్ కోనసీమలో భారీ విస్ఫోటనం... ధ్వంసమైన ఇల్లు.. యువకుడికి తీవ్ర గాయాలు.. జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్ డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం. ఈ నెల 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి చారిత్రక క్లాక్ టవర్లు, ఢిల్లీ 900 స్లేవ్స్ వెనుక ఉన్న రహస్యాలు: భారత కాల రక్షకులపై ఆసక్తికర పుస్తకం అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ మెట్రో సత్తా: బెర్లిన్ ఇన్నోట్రాన్స్ 2026 ప్రదర్శనలో డీఎంఐఎల్ అరంగేట్రం ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని 2028-29 నాటికి పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం

అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం.

Select Suryaa Now
అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం.

 

కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరిక.

జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలకు ఆదేశం.

నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు.

అనకాపల్లి, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్: జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని బాణాసంచా తయారీ కేంద్రాలు, అక్రమ నిల్వలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల SHO లు తమ పరిధిలోని బాణాసంచా తయారీ కేంద్రాలలో తక్షణమే ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. అనుమతి పొందిన కేంద్రాల్లో అగ్నిమాపక పరికరాలు, నీరు, ఇసుక వంటి భద్రతా ఏర్పాట్లు నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఎలాంటి అనుమతి లేని తయారీ లేదా నిల్వ కేంద్రాలు పనిచేయకుండా క్షేత్రస్థాయిలో విచారించాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి పొందిన ప్రదేశాలలో మాత్రమే నిర్ణీత పరిమితికి లోబడి తయారీ, నిల్వ జరపాలి. మైనర్లను, నైపుణ్యం లేని వారిని పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. నివాస ప్రాంతాలు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలలో బాణాసంచా తయారీ లేదా భారీ నిల్వలు పూర్తిగా నిషేధం. తయారీ ప్రదేశాల వద్ద విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండాలి, ధూమపానం నిషేధం. అలాగే ప్రజలకు విజ్ఞప్తి అని మీ పరిసరాల్లో అనుమతి లేకుండా బాణాసంచా తయారు చేస్తున్నా, అక్రమంగా నిల్వ ఉంచినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.