రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం
వరుసగా రెండో ఏడాది లడ్డూను దక్కించుకున్న దేవరపు మాల్యాద్రి
విజయవాడ సెంట్రల్, సెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ ఫస్ట్ లైన్ సెకండ్ అడ్డరోడ్డులో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహానికి ఆదివారం ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు, శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపు మాల్యాద్రి 11 కిలోల లడ్డూను రూ.1.55 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. వరుసగా రెండో ఏడాది ఆయన లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది రూ.1.16 లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ వారు శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 4 వేల మందికి అన్నప్రసాదం అందించారు. అనంతరం సాంప్రదాయ మేళతాళాలు, భక్తుల కోలాహలం మధ్య గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.