BREAKING
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన! కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం రోష్ హషానా సందర్భంగా నెతన్యాహు, యూదు సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్ కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం జాతీయ లోక్ అదాలత్తో త్వరితగతిన కేసుల పరిష్కారం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం పరిపక్వ దశకు బ్రిక్స్ కూటమి భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్. వర్ధమాన రంగాల్లో భారత్-యూఏఈ భాగస్వామ్యం

18–55 ఏళ్ల బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

Select Suryaa Now
18–55 ఏళ్ల బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

18–55 ఏళ్ల బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

సంగారెడ్డి, :--  జిల్లాలోని బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందించేందుకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి అర్హులైన మహిళలు సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన మహిళలు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనుటకు  ఈ నెల 15  చివరి తేదీ అని తెలిపారు.దరఖాస్తుదారుల వయస్సు 18 నిండి 55 సంవత్సరాల లోపు ఉండాలని, నిరుద్యోగ మహిళలు, నిరుపేదలు, నిరాధారణకు గురైన వితంతు, ఒంటరి, వికలాంగులు, అనాధ మహిళలకు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.నివాసం, కులం, ఆదాయం, ఆధార్, విద్యార్హత, టైలరింగ్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలు, తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని, కనీస అక్షరాస్యత తప్పనిసరి అని, ఎక్కువ దరఖాస్తులు వస్తే కనీస విద్యార్హత ఐదవ తరగతి పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణులకు 1.50 లక్షలు, పట్టణ వాసులకు రెండు లక్షల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కాదని స్పష్టం చేశారు.దరఖాస్తుదారులు దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని కుల, ఆదాయ, నివాస, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, విద్యార్హతలు, టైలరింగ్ శిక్షణ, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాలతో గ్రామీణులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ ప్రాంతవాసులు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు  ఈ నెల 15లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.