BREAKING
స్పామ్ కాల్స్‌ కట్టడికి ట్రాయ్ సంచలన నిర్ణయం.. కఠినతరమైన కొత్త నిబంధనలు అమలు ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కోలుకోలేని పాకిస్థాన్.. సర్గోధా రన్‌వే బాగుచేయలేక నానా తంటాలు జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు: యజమాని ప్రదీప్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ శ్రీ శనేశ్వర స్వామి ఆలయం – మండపల్లి.. శని దోష నివారణకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు వైయస్సార్ కడప జిల్లా బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ పదవికి వారెన్ బఫెట్ గుడ్‌బై చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్. అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ ఎల్‌నినోపై ఉమ్మడి పోరాటం.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌... ఎమ్మెల్యేగా అనర్హత వేటు! 2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’

చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్.

Select Suryaa Now
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్.

 

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి – జిల్లా ఎస్పీ.

చండూర్ మేజర్ న్యూస్.. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్  శుక్రవారం చండూర్ పోలీస్ స్టేషన్‌, సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డు గదులు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను ఎస్పీ  పరిశీలించారు.

పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసులు, కోర్టు కేసుల వివరాలను పరిశీలించి, కేసుల దర్యాప్తు పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, ఆధారాలను పకడ్బందీగా సేకరించి, నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు.

అలాగే స్టేషన్‌లోని క్రైమ్ రిజిస్టర్, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, సీడీ ఫైల్స్, కోర్టు కేసుల రికార్డులు, స్టేషన్ రికార్డులు, బీట్ బుక్స్ తదితర రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, గతంలో నేరాలు జరిగిన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరమైన పరిధిలో తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు.

చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చోట్ల బీట్ పెట్రోలింగ్‌ను పెంచాలని సూచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేసి నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా జిల్లా ఎస్పీ  అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులు, సెలవులు, వసతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకుని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్  తెలిపారు.

ఈ వార్షిక తనిఖీలో ఎస్పీ  వెంట నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, చండూర్ సీఐ రాము, డి.సి. ఆర్.బి సిఐ శ్రీను నాయక్,ఎస్.ఐ శివకుమార్ సంబంధిత పోలీస్ అధికారులు, చండూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు..