BREAKING
వైయస్సార్ కడప జిల్లా బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ పదవికి వారెన్ బఫెట్ గుడ్‌బై చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్. అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ ఎల్‌నినోపై ఉమ్మడి పోరాటం.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌... ఎమ్మెల్యేగా అనర్హత వేటు! 2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’ ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రధాని మోదీ సాంకేతిక దార్శనికతతో బలోపేతమవుతున్న డిజిటల్ భారత్ పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మిశ్రమ ఫలితాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం గజాసురుడికి నందీశ్వరుడికి మధ్య జరిగిన భీకర పోరాట రహస్యం ఇదే

దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌... ఎమ్మెల్యేగా అనర్హత వేటు!

Select Suryaa Now
దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌...  ఎమ్మెల్యేగా అనర్హత వేటు!

2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత వర్తింపు
స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం

కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
ఏలేటి, కౌశిక్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీగా అయినట్లు స్పష్టీకరణ

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ మార్పు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దానం నాగేందర్‌ 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడిగా పరిగణించాలని స్పష్టం చేసింది. దానం నాగేందర్‌ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖైరతాబాద్‌ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ నిబంధనలను ఆయన ఉల్లంఘించారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు సమర్పించినప్పటికీ.. సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్‌ ట్రైబ్యునల్‌ 2026 మార్చి 11న పిటిషన్లను తిరస్కరించిందని పేర్కొన్నారు.
స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం స్పీకర్‌ నిర్ణయంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తాజా తీర్పుతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయాన్ని స్పీకర్‌, ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టు తీర్పును తొలుత సెప్టెంబర్‌ 16న వెలువరించాల్సి ఉండగా.. శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.