BREAKING
వైయస్సార్ కడప జిల్లా బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ పదవికి వారెన్ బఫెట్ గుడ్‌బై చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్. అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ ఎల్‌నినోపై ఉమ్మడి పోరాటం.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌... ఎమ్మెల్యేగా అనర్హత వేటు! 2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’ ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రధాని మోదీ సాంకేతిక దార్శనికతతో బలోపేతమవుతున్న డిజిటల్ భారత్ పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మిశ్రమ ఫలితాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం గజాసురుడికి నందీశ్వరుడికి మధ్య జరిగిన భీకర పోరాట రహస్యం ఇదే

ఎల్‌నినోపై ఉమ్మడి పోరాటం.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

Select Suryaa Now
ఎల్‌నినోపై ఉమ్మడి పోరాటం.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్, సూర్య న్యూస్ నెట్ వర్క్ :ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ ని కోరారు.

దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన్ని కలిసి వర్షాభావం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రస్తుత వర్షాభావ  పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ వివరాలతో వినతిపత్రాన్ని అందజేశారు.

 వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. అలాగే, తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు.

ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి  చెప్పారు. పంటల మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు. 

 ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

 PMAYG పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ అందుకు కేంద్ర మంత్రి కి ముఖ్యమంత్రి  కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో వినతిపత్రం అందించిన విషయాన్ని ప్రస్తావించారు.

 రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి ని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని, అలాగే సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ను అందించి ప్రోత్సహిస్తున్నామని వివరించారు.