వైయస్సార్ కడప జిల్లా
కడప, సెప్టెంబర్ 18:
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు రూరల్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది.
కడప POCSO కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.8,000 జరిమానా విధించింది.
బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రేమ పేరుతో బాలికను నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం సజీవ దహనం చేసి హత్య చేశాడు.
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
కేసు క్రైమ్ నంబర్ 231/2024 కింద నమోదు అయింది.
BNS-2023 సెక్షన్లు 64, 103, 303(2), 238 మరియు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలతో నేరం రుజువు చేశారు.
నిందితుడిని 30 గంటల్లోనే అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణ అనంతరం నిందితుడికి కఠిన శిక్ష విధించింది.
మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.