BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

యుపీని ముంచెత్తిన భారీ వర్షాలు..తీవ్రరూపం దాల్చిన వరదలు

Select Suryaa Now
యుపీని ముంచెత్తిన భారీ వర్షాలు..తీవ్రరూపం దాల్చిన వరదలు

పాఠశాలలు మూసివేత, రైళ్ల రాకపోకలు బంద్!
ఉత్తరప్రదేశ్: మంగళవారం కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ, వారణాసి, చిత్రకూట్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీగా నీరు నిలిచిపోవడంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.


మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాల వల్ల చిత్రకూట్‌లో మందాకిని నది ప్రమాద స్థాయి కంటే ఏకంగా నాలుగు మీటర్లు పైగా ప్రవహిస్తోంది. రామ్‌ఘాట్, నిర్మోహి అఖారా వంటి మతపరమైన ప్రదేశాలు నీట మునిగాయి. గంగా నది నీటిమట్టం గంటకు 0.5 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతూ సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ప్రకారం హెచ్చరిక స్థాయి (70.26 మీటర్లు) దాటి 70.28 మీటర్లకు చేరింది. శారదా నదితో పాటు నేపాల్ సరిహద్దుల్లోని మోహన, కర్నాలి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామాలు, దుధ్వా నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.

లఖింపూర్ జిల్లాలో 8వ తరగతి వరకు పాఠశాలలకు ప్రాథమిక విద్యాశాఖ అధికారి ప్రవీణ్ తివారీ సెలవు ప్రకటించారు. శారదా నది ఉప్పొంగడంతో మైలాని-నన్‌పారా మార్గంలో దాదాపు అరడజను రైళ్లను నిలిపివేశామని ఈఆర్ పీఆర్ఓ మహేష్ గుప్తా తెలిపారు.

వారణాసిలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు నీట మునిగిపోవడంతో సందులు, ఇళ్ల పైకప్పులపైనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీట మునిగిన వీధుల్లో పడవలు ప్రయాణిస్తున్నాయి. చిత్రకూట్‌లో ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డిఐజి రాజేష్ ఎస్ తెలిపారు. బాధితులకు ఉచితంగా ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నట్లు కమిషనర్ అజిత్ కుమార్ పేర్కొన్నారు.