BREAKING
ప్రధాని మోదీ ప్రోత్సాహం కళాకారులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఉజ్జయినిలో గిన్నిస్ రికార్డు వినాయక నిమజ్జనానికి నీటి తిప్పలు.. ఎండిపోయిన చెరువులతో భక్తుల ఆవేదన లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు భారత్-నేపాల్ మధ్య వాణిజ్య, అనుసంధాన చర్చలు ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో భారత్‌కు అగ్రస్థానం: ఇంటెల్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తేలికపాటి వర్ష సూచన లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌కు ఆసియా క్రీడలే కీలక మైలురాయి: కోచ్ రెబౌల్ కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా పూర్తికాకముందే కోట్ పల్లి ప్రాజెక్టు కాలువలకు బీటలు..! రాష్ట్రంలోనే మొదటి స్థానం…మోడల్ గ్రామంగా జి.భీమవరం. వంతెన శితిలాల్లో.. దొంగలు పడ్డారు సౌదీ, హౌతీల మధ్య తీవ్రమైన దాడులు అమెరికా, ఇరాన్‌ల నేరాలపై ఆధారాలు లభ్యం

ఉజ్జయినిలో గిన్నిస్ రికార్డు

Select Suryaa Now
ఉజ్జయినిలో గిన్నిస్ రికార్డు

ప్రధాని మోదీ పుట్టినరోజు వేళ మధ్యప్రదేశ్‌లో 3.55 కోట్ల దీపోత్సవం 
ఉజ్జయిని: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు మరియు 'సేవా సంకల్ప అభియాన్' ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ వ్యాప్తంగా గురువారం సాయంత్రం 3.55 కోట్ల 'ఆశీర్వాద దీపాలు' ఏకకాలంలో వెలిగించారు. ఈ సంబరాల ప్రధాన వేడుక ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో వైభవంగా జరిగింది. ఇక్కడ క్షిప్రా నదీ తీరంలోని ఘాట్‌లు, మహాకాల్ లోక్ కారిడార్లలో ఏకంగా 33.27 లక్షల ప్రమిదలను వెలిగించి నూతన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. సాయంత్రం 7 గంటలకు సైరన్ మోగిన అనంతరం రామ్‌ఘాట్ వద్ద వేలాది మంది భక్తులతో కలిసి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ దీపోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ మహోత్సవంలో 25,000 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానికులు పాల్గొని క్షిప్రా హారతి సమర్పించారు. దేశానికి ప్రధాని మోదీ అందించిన పాతికేళ్ల నిరంతర సేవలకు, దేశ నిర్మాణాకి ప్రజలు తెలిపిన కృతజ్ఞతకు ఈ దీపోత్సవం నిదర్శనమని సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల పాటు సాగే 'సేవా సంకల్ప అభియాన్' ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి మూలకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 845 ప్రధాన కేంద్రాల్లో ఈ ఆశీర్వాద దీపాల కార్యక్రమం ఏకకాలంలో అత్యంత కోలాహలంగా నిర్వహించబడింది.