వెలిగొండ నీటి విడుదలకు కదలిరండి
పామూరు, మేజర్ న్యూస్ : కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించనున్న వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్న నేపథ్యంలో ప్రజలు, టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలిరావాలని కోరుతూ టి ఎన్ ఎస్ వి మాజీ జిల్లా కార్యదర్శి పోకా నాయుడు కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు.టీడీపీ నాయకులు, సుబ్బక్కపల్లి గ్రామ మహిళలు పాల్గొని ప్రజలకు కార్యక్రమం వివరించారు. ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.