BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

Select Suryaa Now
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (ఆగస్టు 30):వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతల చెరువు సమీపంలో రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కారులో మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఖాజా బీ (65), జహంగీర్ బీ (78) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతులు మరియు క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.