|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 10:52 AM
కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి ఘటనలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. కవల పిల్లలలో ఒకరికి సరిగ్గా మాటలు రావడం లేదని తల్లిని నిత్యం వేధించిన తండ్రి. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి అనిల్ కుమార్(30)తో, హైదరాబాద్‌లో స్థిరపడిన సాయిలక్ష్మి(27)కి మూడేళ్ల క్రితం వివాహం జరగగా, వీరికి కవల పిల్లలు. కవల పిల్లలలో ఒక కూతురు, ఒక కొడుకు కాగా.. కొడుకుకి మాటలు సరిగ్గా రావడం లేదని నిత్యం భార్యను బాధ్యురాలిని చేస్తూ వేధించిన అనిల్. కుమారుడిని తీసుకొని సాయిలక్ష్మి పలు ఆసుపత్రులు తిరగగా.. ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పినా మారని అనిల్ కుమార్. దీంతో అనిల్ వైజాగ్‌కి వెళ్ళడానికి సోమవారం సాయంత్రం ఇంట్లో నుండి వెళ్లగా, అప్పుడే వీడియో రికార్డ్ చేసి దారుణానికి ఒడిగట్టిన సాయిలక్ష్మి. ఆయన మారడు, అందుకే కష్టమైనా పొరపాటు చేస్తున్నా.. నేను లేనప్పుడు పిల్లలు ఉండడం అనవసరం, నాతో వచ్చిన పిల్లలు నాతోనే పోవాలి అని వీడియో రికార్డ్ చేసిన భార్య. తర్వాత నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను దిండుతో అదిమి చంపి, వారు నివసిస్తున్న 4వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సాయిలక్ష్మి. సాయిలక్ష్మి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్న పోలీసులు