సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశాల తేదీని వెల్లడించారు.
శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై తొలి రోజు భేటీ అనంతరం జరిగే 'శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ' (BAC) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సమాయత్తమవుతుండగా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.