BREAKING
వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ విడుదల: అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వినాయక విగ్రహ నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం.. డీఏలు ఆర్కెస్ట్రాలు నిషిద్ధం.. సీఐ.ఎస్ఐల సూచన.. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బిఆర్ఎస్ పై కాంగ్రెస్ టార్గెట్ నితిన్, మురళీకాంత్ కాంబినేషన్ ‘అలియాస్ రుక్మిణీ’ ప్యాకప్: పది రోజుల తొలి షెడ్యూల్ పూర్తి ‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్ నెక్స్ట్ లెవెల్: విశేషాలు వెల్లడించిన ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ బన్నీ వాస్, సుకుమార్ల 'ఇడుపు కాయితం' నుంచి 'శ్రీలత..' పాటకు విశేష స్పందన: హర్షం వ్యక్తం చేసిన సురేష్ బొబ్బిలి, అలరాజు మండాడి’ చిత్రానికి విచిత్ర ఆదరణ: గ్రాండ్‌గా విజయోత్సవ వేడుక నిర్వహించిన చిత్రబృందం మహేంద్రగిరి వారాహి’కి లభిస్తున్న ఆదరణపై హర్షం: థ్యాంక్స్ మీట్‌లో హీరో సుమంత్, చిత్రబృందం సెప్టెంబర్ 18న ‘సీక్రెట్ సోల్జర్’ విడుదల: ప్రమోషన్లలో ముచ్చటించిన కథానాయకులు నిహాల్, సూర్య శ్రీనివాస్ మధుయాష్కిని కలిసిన ఏఐపీసీ తెలంగాణ ప్రతినిధులు ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై చర్చ బ్రిక్స్ సదస్సులో నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ భేటీ: సరిహద్దు, ద్విపాక్షిక సంబంధాలపై సుదీర్ఘ చర్చలు పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సంక్షేమానికి కీలకం – విద్యతో పాటు క్రీడలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం – మాదకద్రవ్యాలకు దూరంగా.. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం డీజీపీ సి.వి. ఆనంద్‌ వెల్లడి విద్యా విజయాలకు మార్గదర్శి.. కదిరి బాబు రంగారావు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన! కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం

ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బిఆర్ఎస్ పై కాంగ్రెస్ టార్గెట్

Select Suryaa Now
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బిఆర్ఎస్ పై కాంగ్రెస్ టార్గెట్

 

'సంధ్యారావు’ ఫేక్‌ అకౌంట్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నవాబుపేట,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 12):ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని బీఆర్ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ‘సంధ్యారావు’ పేరుతో నకిలీ ఎక్స్‌ ఖాతాను సృష్టించి, దానిని అసెంబ్లీలో ప్రస్తావించారని ఆయన అన్నారు. ఈ ఫేక్‌ అకౌంట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారో తేల్చాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.నవాబుపేట మండల కేంద్రంలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి గార్డెన్స్‌లో కడిచర్ల సుధాకర్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యువత, బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన, తాజా రాజకీయ పరిణామాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కేసీఆర్‌ను ఉద్దేశించి షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉద్యోగుల పీఆర్‌సీ, డీఏల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్‌ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కడిచర్ల సుధాకర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కేక్‌ కట్‌ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, మండల అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్‌, దేశముల ఆంజనేయులు, భరత్‌రెడ్డి, విజయ్‌ క్షత్రియ, విజయ్‌కుమార్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పురుషోత్తం చారి, శాంతికుమార్‌, మహేశ్వర్‌రెడ్డి, కావలి రాజు, సంతోష్‌కుమార్‌, మల్లేశం, తలారి శేఖర్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.