కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయత్నం
కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయత్నం
అప్పాజీపల్లిలో ఎలుగుబంటి వేషధారణతో అవగాహన కార్యక్రమం
కొల్చారం మేజర్ న్యూస్...
మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో కోతుల బెడద నివారణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వెంకట్ గౌడ్ (గజిని) ఆధ్వర్యంలో ఎలుగుబంటి వేషధారణలో వ్యక్తులను ఏర్పాటు చేసి, గ్రామంలోని వార్డుల గుండా తిప్పుతూ కోతులను తరిమే ప్రయత్నం చేశారు.
కోతుల గుంపులు ఇళ్లలోకి రావడం, పంటలను నాశనం చేయడంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ వినూత్న ప్రయత్నం చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చలం నరసింహులు, వార్డు సభ్యులు సదాల నర్సింలు, కన్యబోయిన రామానుజన్, కాదూరి సుశీల, మానేపల్లి సావిత్రి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతల భాగయ్య, సంఘ సభ్యులు రాజబోయిన జోగులు తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామ యువకులు చింతల సురేందర్, అక్కమ్మ రాములు, కాదూరి కుమార్, తిమ్మకపల్లి సుధాకర్, తిమ్మకపల్లి ప్రభు, గ్రామస్తులు నేరెళ్ల కృష్ణ, నేరెళ్ల శేకులు, పితిరి రవి, చింతల నరేందర్, రాజబోయిన సాయి, రాజబోయిన శ్రీకాంత్తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు గ్రామస్తులందరికీ సర్పంచ్ వెంకట్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.