పెద్దపల్లిలో నీట్-పీజీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి
పెద్దపల్లి, ఆగస్టు 30: నీట్-పీజీ 2026 పరీక్షల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పెద్దపల్లి జోన్ పరిధిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సీపీ సూచించారు.