కొత్తపల్లిలో భారీ చోరీ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా.. 50 తులాల బంగారం అపహరణ
సూర్య,మాక్లూర్
మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన వేములపల్లి శ్రీనివాస్ (రేషన్ డీలర్) బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లడంతో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు సమాచారం.
ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు సుమారు 50 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పరిశీలించగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చోరీకి సంబంధించి ఆధారాలను సేకరించి, నిందితుల కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో బంగారం చోరీ కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.