వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రూ.27 కోట్లతో ఆధునీకరణ.. ఏడాది చివరికి పనులు పూర్తి: కిషన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న ఆధునీకరణ పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.27 కోట్లతో స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని, రెండు లిఫ్టులు, ఎస్కలేటర్లు, క్యాంటీన్, దివ్యాంగులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయని వెల్లడించారు. అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రితో చర్చిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి, రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్. గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.