BREAKING
మీర్‌పేట్‌లో పోలీసుల మెరుపు సోదాలు.. భారీగా రంగంలోకి దిగిన బలగాలు! తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు కృష్ణా జలాలపై మళ్లీ పంచాయితీ.. తెలంగాణ, ఏపీ మధ్య కుదరని ఒప్పందం! హైదరాబాద్‌లో తాగునీటికి బ్రేక్.. ఈ ప్రాంతాల్లో సరఫరా అంతరాయం హైదరాబాద్‌లో మారథాన్ సందడి.. వాహనదారులకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు! తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు! కొత్తపల్లిలో భారీ చోరీ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా.. 50 తులాల బంగారం అపహరణ సంగారెడ్డి జిల్లాలో వర్షపాతం పరిస్థితి... తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PRCపై ప్రభుత్వం కీలక కసరత్తు! వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రూ.27 కోట్లతో ఆధునీకరణ.. ఏడాది చివరికి పనులు పూర్తి: కిషన్ రెడ్డి నేపాల్‌లో పెను విషాదం: ఆకస్మిక వరదల్లో 734 మంది మృతి, వేలాదిగా గల్లంతు అంబటి రాంబాబుకు గుండెపోటు: హైదరాబాద్‌ హాస్పిటల్‌లో స్టెంట్ చికిత్స విజయవంతం నేపాల్ వరదలు: ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతు.. మరో ఇద్దరు సురక్షితం లక్నోలో వీరాంగన అవంతీ బాయి లోధీ విగ్రహావిష్కరణ.. ₹101 కోట్లతో మోడల్ కంటోన్మెంట్‌కు శంకుస్థాపన ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ!

హైదరాబాద్‌లో మారథాన్ సందడి.. వాహనదారులకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు!

Select Suryaa Now
హైదరాబాద్‌లో మారథాన్ సందడి.. వాహనదారులకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్‌లో ఈరోజు 14వ ఎడిషన్‌ NMDC హైదరాబాద్ మారథాన్‌ జరగనుంది. మారథాన్‌ నేపథ్యంలో నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమలు చేస్తున్నారు. ఉదయం వేళల్లో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

మారథాన్‌.. ట్రాఫిక్‌కు బ్రేక్!

పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌ నుంచి మారథాన్‌, హాఫ్ మారథాన్‌ ప్రారంభం కానుండగా.. 10కే రన్‌ మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రన్‌లు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద ముగుస్తాయి. దీంతో మారథాన్‌ మార్గంలో ఉన్న పలు రోడ్లపై వాహనాల రాకపోకలను అవసరాన్ని బట్టి నియంత్రించనున్నారు.

నెక్లెస్‌ రోడ్‌ నుంచి గచ్చిబౌలి వరకు..

నెక్లెస్‌ రోడ్‌, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, రోడ్‌ నంబర్‌ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ జంక్షన్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ తదితర మార్గాల్లో ట్రాఫిక్‌ ప్రభావం ఉండనుంది.

మాదాపూర్‌, హైటెక్ సిటీ వైపు వెళ్లేవారు జాగ్రత్త!

మాదాపూర్‌, రైడుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్‌, కోథగూడ, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ, లింగంపల్లి ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ మళ్లింపులు అమల్లో ఉంటాయి. మారథాన్‌ రన్నర్లు వెళ్లే సమయంలో ఆయా మార్గాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించనున్నారు.

భారీ వాహనాలకు నో ఎంట్రీ!

మారథాన్‌ కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌ వాహనాలు, వాటర్‌ ట్యాంకర్లను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాదాపూర్‌, రైడుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రభావిత మార్గాల్లో అనుమతించరు.

వాహనదారులు ముందే ప్లాన్ చేసుకోవాలి..

మారథాన్‌ మార్గాల్లో ప్రయాణించే వారు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో అత్యవసర ప్రయాణాలు ఉన్నవారు కొంత ముందుగానే బయలుదేరితే ట్రాఫిక్‌ ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. మారథాన్‌ నిర్వహణకు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.