విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన టిప్పర్లు తప్పిన పెను ప్రమాదం
విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన టిప్పర్లు
తప్పిన పెను ప్రమాదం
బొల్లారం డివిజన్ పారిశ్రామిక వాడలో ఘటన
జిన్నారం మేజర్ న్యూస్:ఐడిఏ బొల్లారం ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. స్థానిక శీఫా రెమిడీస్ పరిశ్రమ లో, సమీపంలో రెండు టిప్పర్లు ఎదురెదురుగా రావడంతో ప్రమాదాన్ని తప్పించేందుకు డ్రైవర్ పక్కనే ఉన్న విద్యుత్ పోల్ను ఢీ కొట్టారు. దీంతో విద్యుత్ పోల్ రోడ్డుపై, పరిశ్రమ లోపల విరిగిపడింది. ఆ సమయంలో అక్కడ ప్రజలు, కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గమనించిన స్థానికులు వెంటనే వాహనాలను నిలిపివేసి పోలీసులకు ట్రాన్స్కో అధికారులకు సమాచారం అందించారు. నిత్యం రాత్రింబవళ్లు భారీ వాహనాల రాకపోకలు జరిగే ప్రాంతం కావడంతో అప్రమత్తమైన ట్రాన్స్కో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మెయిన్ లైన్ విద్యుత్ అంతరాయంతో పలు పరిశ్రమలు జనరేటర్ల సహాయంతో ఉత్పత్తులు రన్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.