ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.
ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
ఆలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం అందించిన వంగ రాజేశ్వర్ రెడ్డి
సిద్దిపేట రూరల్, మేజర్ న్యూస్: శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వంగ రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి సహిత విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ కోడూరు మమతా రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆలయ అభివృద్ధి కోసం రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఆంజనేయ స్వామి కృపతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లం సాయి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.