నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
మెదక్ : పాపన్నపేట కొత్త లింగాయపల్లి గ్రామానికి చెందిన నరేందర్–లక్ష్మీ (తేజలక్ష్మి) వివాహం ఆదివారం లక్ష్మీనగర్ ప్రగతి సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మా దేవేందర్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రామతీర్థం సాయిరెడ్డి, లింగాయపల్లి వెంకటేశం సేటు, మాజీ సర్పంచులు నవీన్‌గౌడ్, ఆరేపల్లి శ్రీనాథ్‌రావు, లింగారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కాశీనాథ్‌రావు, చారి తదితరులు ఉన్నారు.