BREAKING
లక్కవరంలో టీడీపీలోకి వైసీపీ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి భారత కే-కల్చర్ అభిమానులకు షిన్ రామన్ రుచులు: 4 నగరాల్లోని హైబ్ ఇండియా పాప్-అప్ పార్కుల్లో నాంగ్‌షిమ్ సందడి అమెరికాకు ఓటమిని అంగీకరించే ధైర్యం లేదు.. ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ప్రమాదాలకు పిలుపునిస్తున్న పిచ్చి మొక్కలు..! నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ భవనంలో సమస్యల పరిష్కార వేదిక ₹5,500 కోట్ల పెట్టుబడితో గ్వాలియర్‌లో ఆసియాలోనే తొలి టెలికాం తయారీ జోన్ అయోధ్య రామమందిరం నేడు పూర్తి బాధ్యతలు చేపట్టనున్న కొత్త సీఈఓ మిశ్రా గురజాడ ఆశయాలను ఆచరణలో పెడదాం - ప్రజాసేవలో నిస్వార్థంగా పనిచేద్దాం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు: కునార్, పక్తికా ప్రావిన్సులపై బాంబుల వర్షం.. తగిన బుద్ధి చెబుతామన్న తాలిబన్లు పాకిస్తాన్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలేమా ఖాన్ అరెస్ట్ ఢిల్లీ-ఎన్సీఆర్‌లో మారుతున్న వాతావరణం పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు  ఫైజర్ సీ అండ్ ఎఫ్ డిపో వివాదంలో వినియోగదారులకు కర్ణాటక ఆరోగ్య శాఖ హెచ్చరిక: అప్రమత్తంగా ఉండాలని సూచన కేరళలోని ఆరు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’

చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత

Select Suryaa Now
చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత


నీళ్ల విడుదల కోరుతూ బీజేపీ ధర్నా.. పోలీసులతో వాగ్వాదం….


డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం సహా పలువురు అరెస్ట్…

 

 సూర్య కరీంనగర్ ప్రతినిధి::


కరీంనగర్‌: గణేశ్‌ నిమజ్జనోత్సవాలకు చింతకుంట కెనాల్‌లో నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ధర్నా సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌పై పోలీసులు దాడి చేశారని, కార్యకర్తలను గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లారని నాయకులు ఆరోపించారు. కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కరీంనగర్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. గణేశ్‌ నిమజ్జనానికి నీటిని విడుదల చేయాలని కోరితే లాఠీలతో కొట్టించడం దారుణమన్నారు. నిమజ్జనానికి నీటిని విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బోయినిపల్లి ప్రవీణ్‌రావు మాట్లాడుతూ అర టీఎంసీ నీటిని అడిగితే ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ.. నిమజ్జనోత్సవాలకు నగర పాలక సంస్థ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ నీటిని విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. నిమజ్జనానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నీటిని విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌ను ఆయన ఖండించారు.