BREAKING
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో క్షీణించిన గాలి నాణ్యత: 62 రోజుల గరిష్టానికి ఏక్యూఐ.. రానున్న వారం పొడి వాతావరణం జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర కుడిపక్ష పార్టీ ఏఎఫ్‌డీ బోణీ ముడి చమురు ధరల తగ్గింపుతో పుంజుకున్న సూచీలు ఆసియా క్రీడల్లో సుచికా తరియల్ చరిత్ర ఏపీకే సైబర్ మోసాల గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు, అహ్మదాబాద్‌లో ముగ్గురి అరెస్ట్ వైభవంగా ప్రారంభమైన ఒడిశా టి20 లీగ్ సీఎం ట్రోఫీ, హాజరైన ముఖ్యమంత్రి బిట్‌కాయిన్ మెరుపు ర్యాలీ: వారంలో 5 శాతం ఎగబాకి 81,450 డాలర్ల వద్దకు.. ఈ జోరుకు కారణాలేంటి? ప్రీమియర్ లీగ్: చివరి నిమిషంలో అద్భుత గోల్, బోర్న్మౌత్‌పై లివర్‌పూల్ కష్టతరమైన విజయం ఆసియన్ గేమ్స్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం వాతావరణ మార్పులపై పోరుకు ప్రజల భాగస్వామ్యం అవసరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసియన్ గేమ్స్: పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్‌కు శ్రీహరి నటరాజ్ అర్హత పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు, క్వార్టర్స్‌లోకి ప్రవేశం ఇస్రో రాడార్ పరిశోధనా కేంద్రానికి సీఎం హిమంత బిస్వా శర్మ శంకుస్థాపన ఒడిశా టి20 లీగ్: గౌరవ్ చౌదరి మెరుపు ఇన్నింగ్స్, కటక్ పాంథర్స్‌పై సంబల్‌పూర్ వారియర్స్ విజయం కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు భారీ ప్రణాళిక: సంక్షేమ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వం సర్వసన్నద్ధం

నేడు కీసర లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

Select Suryaa Now
నేడు కీసర లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

కీసరలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఏర్పాటు

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్

పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రామిడి స్వప్న విజయ్‌రెడ్డి

కీసర, మేజర్ న్యూస్, (సెప్టెంబర్ 21):
కీసర డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా డివిజన్ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కార్యాలయం ఏర్పాటు ద్వారా డివిజన్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా కీసర డివిజన్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కీసర డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని కోరారు.
కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, మహిళా విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.