BREAKING
‘నెరిస్ట్’లో ఆవిష్కరణలు, శ్రేష్ఠతకు అరుణాచల్ గవర్నర్ పిలుపు లడఖ్‌లో ఎన్‌సీసీ బాలికల రికార్డు పర్వతారోహణ మక్కా సమీపంలో డ్రోన్ దాడిని ఖండించిన భారత్ వికసిత్ భారత్ సాధనకు ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యూహాత్మక ఆవశ్యకత 1 కోటికి పైగా పట్టణ గృహాల నిర్మాణం పూర్తి ఓజోన్ పొర పరిరక్షణ, వాతావరణ చర్యలకు భారత్ కట్టుబాటు లార్జ్-క్యాప్స్ మెరుపు రూ. 3 లక్షల వరకు ఎగుమతులకు 'RCMC' నుంచి మినహాయింపు దుబాయ్ కాలేదు.. ‘దెయ్యాల ఓడరేవు’గా మారిన పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్! అమెరికా ఉత్పత్తులను బహిష్కరిస్తున్న కెనడియన్లు రైతుల భవిష్యత్తుకు ఆర్థిక ధీమా ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ. 25,000కు పెంపు యుద్ధ నేరాల కేసులో కొసోవో మాజీ అధ్యక్షుడు థాసికి 25 ఏళ్ల జైలు శిక్ష యెమెన్‌పై సౌదీ బాంబుల వర్షం వాయు కాలుష్యంతో ఆత్మహత్యా ఆలోచనల ప్రమాదం

1 కోటికి పైగా పట్టణ గృహాల నిర్మాణం పూర్తి

Select Suryaa Now
1 కోటికి పైగా పట్టణ గృహాల నిర్మాణం పూర్తి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసే 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్' (PMAY-U) కింద 1 కోటికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అప్పగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2026 ఆగస్టు 9 నాటికి PMAY-U మరియు PMAY-U 2.0 పథకాల కింద మొత్తం 1.25 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించగా, అందులో కోటి ఇళ్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి.

2015 జూన్‌లో ప్రారంభమైన ఈ పథకం గడువును 2026 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. అనంతరం సెప్టెంబర్ 2024లో PMAY-U 2.0ను ప్రారంభించి 2024 నుండి 2029 కాలానికి గాను అదనంగా మరో కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద ఇడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి వర్గాల లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి ₹2.50 లక్షల వరకు సాయం లభిస్తుంది. ముఖ్యంగా గృహ కేటాయింపుల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తూ, మంజూరైన ఇళ్లలో దాదాపు కోటి ఇళ్లను మహిళల పేరిట లేదా ఉమ్మడి యాజమాన్యంలో అందించడం విశేషం. జియో-ట్యాగింగ్, ఏకీకృత వెబ్ పోర్టల్ వంటి ఆధునిక సాంకేతికత ద్వారా ఈ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు.