BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ఏఐ విద్యుత్ డిమాండ్‌కు స్పేస్‌ఎక్స్ పరిష్కారం

Select Suryaa Now
ఏఐ విద్యుత్ డిమాండ్‌కు స్పేస్‌ఎక్స్ పరిష్కారం

టెక్సాస్‌లో గ్యాస్ టర్బైన్ బ్లేడ్ ఫౌండ్రీ ఏర్పాటు!
ఆస్టిన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల నుండి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను త్వరితగతిన తీర్చేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సహజ వాయువు ద్వారా విద్యుత్ ఉత్పత్పి చేసే గ్యాస్ టర్బైన్లలో ఉపయోగించే అత్యంత కీలకమైన బ్లేడ్‌లు, వేన్‌లను తయారు చేసేందుకు టెక్సాస్‌లో ఒక ప్రత్యేక ఇన్-హౌస్ ఫౌండ్రీని స్పేస్‌ఎక్స్ నిర్మిస్తోంది.

ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. విద్యుత్ అవసరాల కోసం సోలార్ ప్యానెల్ ఉత్పత్తిని పెంచుతున్నప్పటికీ, రాబోయే కొన్నేళ్లపాటు సహజ వాయువుపై ఆధారపడటం తప్పనిసరి అని ఆయన తెలిపారు.

సహజ వాయువు టర్బైన్‌ల తయారీలో బ్లేడ్‌లు, వేన్‌లను కాస్టింగ్ చేయడమే ప్రధాన అడ్డంకిగా మారిందని మస్క్ పేర్కొన్నారు. "స్పేస్‌ఎక్స్ లోనే సొంతంగా వీటి కాస్టింగ్ చేయడం వల్ల గ్యాస్ టర్బైన్‌లను అందుబాటులోకి తెచ్చే సమయం ఏకంగా 18 నెలల వరకు తగ్గుతుంది" అని ఆయన వివరించారు.

ఆస్టిన్‌కు తూర్పున ఉన్న బాస్ట్రాప్‌లో, స్టార్‌లింక్ తయారీ ప్లాంట్‌కు ఆనుకుని ఈ ఫౌండ్రీ ఏర్పాటుకానుంది. ఇందుకోసం స్పేస్‌ఎక్స్ ఈ ఏడాది మార్చి-జూన్ మధ్య 830 ఎకరాల భూమిని సేకరించింది. ఈ ప్లాంట్‌లో 1,650°C నుండి 1,980°C వరకు తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకునే 'సింగిల్-క్రిస్టల్ నికెల్-సూపర్‌అల్లాయ్' భాగాలను తయారు చేయనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ఫౌండ్రీలు 2029-30 వరకు పూర్తి బుకింగ్‌లతో నిండిపోవడంతో విద్యుత్ ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోంది. స్పేస్‌ఎక్స్ నిర్ణయం దీనికి ముగింపు పలకనుంది.

ఏరోస్పేస్ లో ఉపయోగించే రాప్టర్ టర్బైన్ విభాగాలు మరియు ఏఐ డేటా సెంటర్ టర్బైన్ భాగాలు ఒకే రకమైన లోహాలపై ఆధారపడి ఉండటం వల్ల, ఈ ఒక్క ఫౌండ్రీతో స్పేస్‌ఎక్స్ రెండు రకాల అవసరాలనూ తీర్చగలదని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, పర్యావరణ అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో ప్లాంట్ ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు.