BREAKING
అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ హిట్ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే? వచ్చే ఏడాది మే-జూన్ నాటికి భారత బుల్లెట్ రైలు పరీక్షలు సుకుమార్ జీనియస్ వెనుక అసలు రహస్యం ఇదే.. ‘Screenplay Master – Sukumar’ పుస్తక ఆవిష్కరణ! పెరుగుతున్న చమురు ధరలు మూడు రాష్ట్రాల్లో ఐటీఐల ఆధునీకరణకు ₹735.70 కోట్లు బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ భారత పర్యటన వడోదరలో రూ. 35,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం రక్షణ, సముద్ర సంబంధాలను బలోపేతం చేసేందుకు రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం కొలంబోకు చేరుకున్నారు నేపాల్‌లో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ ఏక్తా నగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ‘అంతా రాములోరు చూస్కుంటారు’ నుంచి అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్.. శిరీష పాత్రలో క్యూట్ లుక్! ద్విరాజ్య పరిష్కారానికి మద్దతుగా ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ స్థావరాలపై యూకే ఆంక్షలు సౌదీ ఇంధన కేంద్రాలపై హౌతీల దాడి నకిలీ ఉద్యోగ నియామక మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ హిట్ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

Select Suryaa Now
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ హిట్ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

టాలీవుడ్ మరియు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. స్టార్ హీరో సూర్య, క్రేజీ బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. గూస్‌బంప్స్ తెప్పించే కథనం, బలమైన భావోద్వేగాలతో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డుల మోత మోగించింది. బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ మాధ్యమం ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సంచలన విజయం సాధించిన చిత్రం సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటన వెలువరించడంతో సినిమా ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారు లేదా మళ్లీ ఆ మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు ఇంట్లోనే ఉంటూ ఈ సినిమాను వీక్షించే అవకాశం లభించింది.

కథాంశం విషయానికి వస్తే..
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త మాత్రమే కాకుండా, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అగ్రశ్రేణి షూటర్. తన జీవితంలో ఎవరిపై ఆధారపడకుండా ముందుకు సాగే అతనికి 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి మాత్రం చేసుకోడు. భార్య లేకుండానే అమెరికా వెళ్లి సరోగసి ద్వారా ఒక మగబిడ్డకు జన్మనిచ్చి స్వదేశానికి తిరిగి వస్తాడు. అయితే కొన్నాళ్లకే ఆ చిన్నారి ఒక అరుదైన వ్యాధి బారిన పడటంతో పరిస్థితులు తారుమారవుతాయి. బాబును కాపాడుకోవడానికి ఎముక గుజ్జు (Bone Marrow) మార్పిడి అత్యవసరమవుతుంది. దీనికోసం బిడ్డకు జన్మనిచ్చిన అసలు తల్లి ఆచూకీ వెతకాల్సి వస్తుంది.

దీంతో అమెరికాకు మళ్లీ వెళ్లి సరోగసి మదర్ అయిన మ్యాడీ (మమితా బైజు)ని వెతికి పట్టుకుని భారత్‌కు రప్పిస్తాడు సంజయ్. సర్జరీ విజయవంతం కాగానే ఆమె తిరిగి అమెరికా వెళ్లిపోవాలని వారి మధ్య ముందుగానే ఒక కఠినమైన ఒప్పందం కుదురుతుంది. కేవలం ఇరవై ఏళ్ల వయసున్న మ్యాడీ సంజయ్ ఇంటికి అడుగుపెట్టిన తర్వాత వారి జీవితాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా ఒంటరిగా తన కొడుకును పెంచుకోవాలనుకున్న అతని ప్రయత్నం ఎందుకు బెడిసికొట్టింది? మ్యాడీ చూపిన ప్రేమని సంజయ్ ఎందుకు మొదట్లో తిరస్కరించాల్సి వచ్చింది? చివరికి పెళ్లి మరియు జీవితంపై సంజయ్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాడా లేదా అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది.