BREAKING
సూర్య కొత్త సినిమా 'సీన్' గ్లింప్స్ విడుదల: వైవిధ్యమైన సైకో పోలీస్ పాత్రలో స్టార్ హీరో! ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి: ఈ నెల 16న రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీ! దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాల కార్యాచరణ బిగ్‌బాస్ 10 తెలుగు: హైరిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్.. ఎలిమినేషన్ టెన్షన్ షురూ! 'దృశ్యం 3' ట్రైలర్ వచ్చేసింది: అజయ్ దేవ్‌గణ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ మరోసారి అదుర్స్! భారత్‌లో అత్యంత శక్తివంతమైన మిస్సైల్ ఏదో తెలుసా? నిమిషాల్లో శత్రు దేశాలను బూడిద చేసే ఆయుధం ఇదే! ఓలీ రాబిన్సన్ అరుదైన ప్రపంచ రికార్డు: శతాబ్దపు అత్యుత్తమ బౌలింగ్ సగటు నమోదు! భారీ బడ్జెట్‌తో 'మహేంద్రగిరి వారాహి': గొప్ప డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నాం - నిర్మాత మధు కలిపు రూరల్ బ్యాంకుల్లో 13,706 ఉద్యోగాలకు దరఖాస్తులు షురూ: ఈ నెల 21 లోగా అప్లై చేయండి! హైదరాబాద్‌లో డెలివరీ బాయ్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్: 'ప్రగతి కేంద్రాల' ఏర్పాటు! రణబాలి టీజర్ వచ్చేసింది: విజయ్-రష్మిక మాస్ యాక్షన్ అదుర్స్! ఆహార వైవిధ్యం, ప్రోటీన్ లభ్యతపై దృష్టితో 'రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2026' ప్రారంభం యూపీఐ నుండి ప్రపంచ నాయకత్వం వరకు హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి కొత్త దారి డీయూఎస్‌యూ ఎన్నికల నామినేషన్లు

మూడు రాష్ట్రాల్లో ఐటీఐల ఆధునీకరణకు ₹735.70 కోట్లు

Select Suryaa Now
మూడు రాష్ట్రాల్లో ఐటీఐల ఆధునీకరణకు ₹735.70 కోట్లు

పీఎం-సేతు కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ:దేశంలో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ‘పీఎం-సేతు’ (ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్) జాతీయ స్టీరింగ్ కమిటీ తన 5వ సమావేశంలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐటీఐ క్లస్టర్ల కోసం ₹735.70 కోట్ల అంచనా వ్యయంతో కూడిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ తాజా నిర్ణయంతో పీఎం-సేతు కింద మంజూరైన మొత్తం పెట్టుబడుల విలువ ₹2,171 కోట్లకు చేరింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని మెడ్చల్ ఐటీఐ క్లస్టర్ ఆధునీకరణకు ₹254.30 కోట్లు మంజూరయ్యాయి. మేసర్స్ జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సాగే ఈ ప్రణాళికలో మెడ్చల్ ఐటీఐ హబ్‌గా వ్యవహరించనుండగా.. అల్వాల్, షమీర్‌పేట్, కుకునూర్పల్లి, సిద్దిపేట ఐటీఐలు స్పోక్స్‌గా సేవలు అందిస్తాయి. అలాగే రాజస్థాన్‌లోని భివాడి క్లస్టర్‌కు ₹241 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ క్లస్టర్‌కు ₹240.40 కోట్లు కేటాయించారు.

హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో సాగే ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఐటీఐలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తు సాంకేతికతలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.