|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 12:17 PM
పటాన్చెరు : గ్రామాలు, పట్టణాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ.. శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణ పనులకు, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో 20 లక్షల రూపాయల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపటనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలోనూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.