BREAKING
పోలీసు ఉద్యోగార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ 2030 నాటికి ఏఐ వల్ల ప్రపంచ వినాశనం జరిగే అవకాశం సున్నా శాతం తమిళనాడులో విజృంభిస్తున్న డెంగ్యూ ఆసియా క్రీడల భారత పతాకధారిగా పవన్ సెహ్రావత్ రోజ్‌గార్ మేళాలో నేడు 51 వేలకు పైగా నియామక పత్రాల పంపిణీ పొంచి ఉన్న ప్రమాదం అట్టహాసంగా హతః సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్: ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ తనూజ బిగ్‌బాస్‌ హౌస్‌లో రసవత్తరంగా పదమూడో రోజు ఆట: తొలి కెప్టెన్‌గా రైతు బిడ్డ ఎంపిక కింద పడ్డ వినాయక విగ్రహం వెండి ధరలు నేడు ఎంత ఉన్నాయంటే.. తెలంగాణ, ఏపీలో తాజా రేట్లు ఇవే బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయా? తెలంగాణ, ఏపీలో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇదే జాతీయ పోషణ మాసంలో పాల్గొన్న సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ హెచ్-1బి వీసాలపై $1,00,000 రుసుము పొడిగింపు గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా-డెన్మార్క్‌ చారిత్రాత్మక ఒప్పందం క్యూబాలో ఊహించని విపత్తు

పొంచి ఉన్న ప్రమాదం

Select Suryaa Now
పొంచి ఉన్న ప్రమాదం

పొంచి ఉన్న ప్రమాదం..

మంగపేట, సెప్టెంబర్ 19, సూర్య (మేజర్ న్యూస్): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ కాంప్లెక్స్ వద్ద ప్రమాదం పొంచి ఉంది. కార్యాలయ షట్టర్లకు ముందు ఉన్న గేట్‌వాల్‌పై ఏర్పాటు చేసిన ప్లేట్ పగిలిపోయి, ప్రమాదకరంగా మారింది. ప్లేట్ ఎప్పుడు ఊడిపడి ప్రమాదం సంభవిస్తుందోనని అక్కడికి వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులు ఇదే మార్గం గుండా వెళ్తుండటంతో పగిలిపోయిన ప్లేట్ కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ప్లేట్ పూర్తిగా పాడై ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి పగిలిపోయిన ప్లేట్‌ను తొలగించి, గేట్‌వాల్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రమాదం చోటుచేసుకోకముందే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.