గణనాథుని సన్నిధిలో ఘనంగా కుంకుమ అర్చన పూజలు
తిరుమలగిరి మేజర్ న్యూs:- తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మల్లేశ్వరి థియేటర్ వీధిలో శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి సన్నిధిలో శనివారం కుంకుమ అర్చన పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో స్థానిక మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అధిక సంఖ్యలో పాల్గొని లోకకళ్యాణార్థం, కాలనీ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మేడబోయిన పద్మ, బానోతు హీరోని, స్వాతి, స్వరూప, లక్ష్మి, యాకమ్మ, శోభ, రాధ, మల్లమ్మ, నవత, సుజాత, జ్యోతి, భీకి, మమత, పవిత్ర, మంజుల తదితరులు పాల్గొన్నారు.