బాలింతలు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి -అంగన్వాడి సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ
తిరుమలగిరి మేజర్ న్యూస్ :- బాలింతలు గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తక్కువ ఖర్చు తోటి ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ అన్నారు. శుక్రవారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని నెల్లిబండ తండాలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలింతలు గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకొని తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోని అందరూ ఆరోగ్యవంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సంకేపల్లి అనిత,అంగన్వాడి టీచర్ పద్మ,అనూష తదితరులు పాల్గొన్నారు