పోలీసు ఉద్యోగార్థులకు స్క్రీనింగ్ టెస్ట్
*పోలీసు ఉద్యోగార్థులకు స్క్రీనింగ్ టెస్ట్*
---వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల ఎస్సై , కానిస్టేబుల్ అభ్యర్థులకు అవకాశం
--ఈ నెల 20న 5 సెంటర్లలో పరీక్ష.
వరంగల్ సూర్య ప్రతినిధి:19 (మేజర్ న్యూస్ సూర్య)
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. ప్రజా ప్రతినిధులు, జిల్లాల కలెక్టర్ల సహకారంతో పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఇవ్వనున్న ఉచిత కోచింగ్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
తేదీ: 20-09-2026, ఆదివారం ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం 01-00 గంటల వరకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది.
ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో పాల్గొనదలిచిన అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా గూగుల్ ఫామ్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.గూగుల్ ఫామ్ లింక్: https://forms.gle/eD2E5jNfiebo5prG8
టెస్ట్ నిర్వహించబడు సెంటర్లు:
వరంగల్ సి కె ఎం కాలేజీ, దేశాయిపేట,హనుమకొండ ఎస్ వి ఎస్ కాలేజీ, రామారాం,జనగామ సి జె ఐ టి ఇంజనీరింగ్ కాలేజీ, యశ్వంతపూర్ క్రాస్ రోడ్
పరకాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ,నర్సంపేట బిట్స్ కాలేజీ, లక్నేపల్లి
ఈ అవకాశాన్ని పోలీసు ఉద్యోగార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.