BREAKING
మెదక్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారడం ఖాయం జిల్లా పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం రికార్డు స్థాయిల్లో బంగారం, వెండి ధరలు కేపీహెచ్‌బీలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి మహిళ మృతి వైమానిక సర్వే నిర్వహించిన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి యశస్వి జైస్వాల్, అసిథా ఫెర్నాండోలకు మ్యాచ్ ఫీజులో కోత రూ. 1.1 కోట్లకు పైగా నగదు సీజ్ చేసిన ఈడీ భారత్-రష్యా సంబంధాల వృద్ధికి ప్రధాని మోదీనే కారణం చార్మినార్ అందాలకు ముగ్ధుడైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ గుజరాత్‌లో నిరంతర అత్యవసర సేవలు 2030 నాటికి $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం ఛత్తీస్‌గఢ్‌లో భారీగా నక్సల్స్ ఆయుధాలు స్వాధీనం సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన 'అర్చన 31 నాటౌట్' (ఈటీవీ విన్) రివ్యూ!

జిల్లా పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం

Select Suryaa Now
జిల్లా పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం

మెదక్: జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయి. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావ్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆధ్వర్యంలో ఈ నెల 20న ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.

ఎన్నికల నోడల్ అధికారి అదనపు ఎస్పీ, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్ రెడ్డి, రామకృష్ణ పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా కొనసాగాయి. ఎన్నికల ఏర్పాట్లను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారి, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.

జిల్లా పరిధిలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా అభిలాష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఆర్‌ఎస్‌ఐ నరేష్ కార్యదర్శిగా, విజయ్ కోశాధికారిగా, రాము సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

సంఘంలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా సాజిద్ అలీ, సతీష్, విజయ్ కుమార్, గంగామణి, నర్సింలు, రేణుక ఎన్నికయ్యారు. గోపాల్, భాగ్యలక్ష్మి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. పోలీస్ అధికారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.