పరివేదలో ఉచిత మెగా వైద్య శిబిరం
పరివేదలో ఉచిత మెగా వైద్య శిబిరం..
కోహెడ మేజర్ న్యూస్ ; కోహెడ మండలం పరివేదలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్, సన్‌రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. మొత్తం 216 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ట్రస్ట్ లక్ష్యమని వంశీధర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.