నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు
నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఓనం వేడుకలు
రామచంద్రాపురం: నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఓనం వేడుకలకు పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి , ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి , ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓనం పండుగ విశిష్టతను, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. ఓనం పర్వదినాన్ని పురస్కరించుకుని నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అనిల్ కుమార్, నారాయణన్, వినోద్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి, పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.