BREAKING
స్విట్జర్లాండ్‌లో రేవ్ పార్టీలో కాల్పులు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి "ముస్లింలు లేని భారత్‌ను కోరుకునేవారు హిందువులే కారు" టాలీవుడ్‌కు మళ్లీ పండగే.. వరుస హిట్లతో కళకళలాడుతున్న థియేటర్లు! విజయసాయిరెడ్డికి సజ్జల హెచ్చరిక రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు! 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్ విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు మృతి! అస్సాంలో అభివృద్ధి పరుగు ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం తెలంగాణలో వర్షాల జోరు.. 13 జిల్లాలకు అలర్ట్, చల్లబడనున్న వాతావరణం! టీచింగ్ హాస్పిటల్ వద్ద గల్లంతైన వారి బంధువుల తీవ్ర విషాదం నేపాల్‌లో టీచర్‌ హీరోయిజం.. 1,643 మంది పిల్లలను వరద నుంచి కాపాడిన రాజేంద్ర దవాడి! సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ కామెంట్స్.. ‘స్పిరిట్’పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్! సంకష్టహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారు? గణేశుడిని ఆ రోజు పూజిస్తే ఏం జరుగుతుంది?

'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్

Select Suryaa Now
'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్

'సుదర్శన క్రియ' నేర్చుకుని అధికారికంగా కుటుంబంలో చేరానని ప్రకటన
బెంగళూరు: బెంగళూరులోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్'లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ మానవాళికి అందిస్తున్న సేవల 45 ఏళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరియు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గత 20 ఏళ్లుగా గురూజీ నుంచి తనకు అపారమైన ప్రేమ, నమ్మకం లభించడం తన అదృష్టమని పేర్కొంటూ, 45 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

తీహార్ జైలు అనుభవం – సుదర్శన క్రియ
తాను గత వారమే 'సుదర్శన క్రియ' నేర్చుకున్నానని, దీని ద్వారా అధికారికంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబంలో సభ్యుడిగా చేరినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. తమపై తప్పుడు ఆరోపణల వల్ల తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, అయితే అక్కడే మనీష్ సిసోడియా సుదర్శన క్రియను నేర్చుకున్నారని చెప్పారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆ ధ్యాన ప్రక్రియ ఎంత అద్భుతంగా ఉంటుందో సిసోడియా చెప్పి, తనను కూడా సాధన చేసేలా ప్రేరేపించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.