దుద్దెడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూరోద్దీన్
దుద్దెడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూరోద్దీన్
కొండపాక :కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దుద్దెడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూరోద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల కనకారాములు, ఏఎంసి చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి జీరో కరెంట్ బిల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తుందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసరి లింగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గజవెల్లి సుదర్శన్, వివిధ గ్రామాల సర్పంచులు కొయ్యడ వెంకటేశం, బొమ్మ మల్లయ్య, యూత్ ప్రెసిడెంట్ బాబు, మాజీ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మహాదేవ్, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆరెపల్లి శ్రీనివాస్, ఏఎంసి డైరెక్టర్ లు రాజు, కొమ్ము మల్లికార్జున్ మాదిగ, నాయకులు పంజా చిరంజీవి యాదవ్, అఖిల్, రాంపల్లి, బందారం, మర్పడగ, సిరసినగండ్ల అధ్యక్షులు, మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ మిద్దె శంబయ్య, శివ, ఇందిరమ్మ కమిటీ మెంబర్ బాకీ రాజశేఖర్, మద్దూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.