బిఆర్ఎస్ ఎండపల్లి మండలాధ్యక్షుని ఆత్మహత్య
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ శనివారం తెల్లవారుజామున గుల్లకోట లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ వేడుకున్నట్లు తెలుస్తోంది. జగన్ అకాల మరణంతో పార్టీ శ్రేణులు, మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అయితే ఎండపల్లి మండలం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం పరిధిలోనిధి కావడం గమనార్హం.