గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి:ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు
బీరెల్లిగూడెంలో ఘనంగా గణేష్ అన్నదాన కార్యక్రమం
మునుగోడు,మేజర్ న్యూస్:
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు సూచించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని బీరెల్లిగూడెం గ్రామంలో గురువారం గణనాథుని భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
గ్రామంలో ఉత్సవాలు ఐక్యత, భక్తి భావాన్ని పెంపొందించేలా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.