టెక్‌బాల్‌లో క్విమ్సీ సెమీఫైనల్‌కి దూసుకెళ్లింది
జపాన్‌తో భారత మహిళల క్రికెట్ పోరు
నగోయా: ఐచి-నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత అరంగేట్ర టెక్‌బాల్ క్రీడాకారిణి క్విమ్సీ జోక్విమ్ డిసౌజా మహిళల సింగిల్స్ విభాగంలో వరుస విజయాలతో సెమీఫైనల్స్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లలో జపాన్‌కు చెందిన యుయినా సకమోటోపై 2-1 తేడాతో, కంబోడియాకు చెందిన కోమ్యాన్ డివైపై 2-0 తేడాతో ఘనవిజయాలు సాధించి క్విమ్సీ ఈ అర్హత సాధించింది. సింగిల్స్‌లో అద్భుతంగా రాణించిన ఆమె, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మొహమ్మద్ అనస్ ఇమ్రాన్ బేగ్‌తో కలిసి ఫిలిప్పీన్స్ జోడీతో తలపడనుంది.
మరోవైపు ఆసియా క్రీడల క్రికెట్ పోటీలలో భారత మహిళల జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. క్వార్టర్ ఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో తలపడనుంది. ఇటీవలే ఎనిమిదోసారి ఆసియా కప్ గెలుచుకున్న భారత జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో నిలిచి బలమైన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టీ20 ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న జపాన్ జట్టు భారత్‌తో తలపడటం ఇదే తొలిసారి.