శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాష్ పురబ్
దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: పవిత్రమైన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాష్ పురబ్ పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ చూపిన దివ్య మార్గం శతాబ్దాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ స్పందిస్తూ... శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ శతాబ్దాలుగా నిస్వార్థ సేవ, మానవ గౌరవం మరియు సార్వత్రిక ఐక్యతను చాటిచెప్పే ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ పావన దినం సమాజంలో కరుణ, సామరస్యం మరియు సోదరభావం వంటి నైతిక విలువలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రశాంతమైన ప్రపంచ నిర్మాణానికి అందరినీ ప్రేరేపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.