BREAKING
పట్టుబడిన పిడిఎస్ బియ్యం డీసీఎం సీజ్ దుష్ప్రచారాలు నమ్మొద్దు గణేశ్ నిమజ్జనాలపై హైడ్రా చీఫ్ రంగనాథ్ గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైడ్రా వ్యతిరేకం కాదన్న రంగనాథ్ మండాడి మూవీ రివ్యూ: సూరి, సుహాస్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే? నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 1,871 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వ్యూహాత్మక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్ ఇ-కామర్స్ నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం అటవీ మదింపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. 'విత్తన గణపతి'ని పూజిద్దాం: విజయ్ దేవరకొండ పిలుపు బఖిరా సరస్సు అవక్షేపాల అధ్యయనం భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు పారిస్ అంతరిక్ష సదస్సు మూడు రోజుల పతనానికి బ్రేక్ బీహార్‌లో వరదల బీభత్సం రేపు బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె* సమ్మిళిత ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు

గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు

Select Suryaa Now
గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు

దుబాయ్: పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో ఉత్తర గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న అనేక వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు జరిగాయని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) బుధవారం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పోర్ట్ రషీద్‌కు 24 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసి ఉన్న ఒక నౌకపై క్షిపణి దాడి జరగడంతో అందులోకి నీరు చేరి, నౌక ఒకవైపుకు ఒరిగిపోయినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనల్లో ప్రాణనష్టం లేదా పర్యావరణ నష్టంపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

అమెరికా నావికాదళ యుద్ధనౌకపై జరిగిన క్షిపణి దాడుల ప్రయత్నాలకు ప్రతిగా యూఎస్ సెంట్రల్ కమాండ్ ఐదు ఇరాన్ ముడి చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసింది. ఈ చర్యకు ప్రతీకారంగా గల్ఫ్‌లో రెండు అమెరికా నౌకలతో పాటు ఎనిమిది చమురు ట్యాంకర్లపై తాము దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిలోని అసురక్షిత ప్రాంతాన్ని దాటేందుకు యత్నించడం వల్లే ఈ దాడులు జరిగాయని తెలిపింది. దాడుల పరంపరతో గల్ఫ్ సముద్ర మార్గంలో నౌకాయానం అత్యంత ప్రమాదకరంగా మారింది.