BREAKING
అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు

చైనా అధ్యక్షుడి భారత్ పర్యటనపై కీలక కసరత్తు.. అజిత్ డోవల్ భేటీతో పెరిగిన ఆసక్తి

Select Suryaa Now
చైనా అధ్యక్షుడి భారత్ పర్యటనపై కీలక కసరత్తు.. అజిత్ డోవల్ భేటీతో పెరిగిన ఆసక్తి

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు అవకాశాలు కనిపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జిన్‌పింగ్ భారత్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటన ఖరారైతే దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో అడుగుపెట్టనున్నారు.

మరోవైపు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ బీజింగ్ చేరుకున్నారు. భారత్-చైనా సరిహద్దు సమస్యలపై జరిగే ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. చైనా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు వాంగ్ యీతోనూ డోవల్ భేటీ కానున్నారు.

జిన్‌పింగ్ భారత్ పర్యటనకు ముందు డోవల్ బీజింగ్ పర్యటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.