BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

‘ఇరుముడి’ విజయంపై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. 50 ఏళ్లలో ఇలాంటి సక్సెస్ చూడలేదంటూ!

Select Suryaa Now
‘ఇరుముడి’ విజయంపై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. 50 ఏళ్లలో ఇలాంటి సక్సెస్ చూడలేదంటూ!

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రవితేజ సినిమాపై తన అనుభూతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

రవితేజ మాట్లాడుతూ.. సాధారణంగా తాను పెద్దగా భావోద్వేగాలకు గురికానని, అయితే ‘ఇరుముడి’ సినిమా చూసినప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పారు. హిందీలో రాజ్‌కుమార్ హిరాణీ సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి భావోద్వేగాన్ని కలిగిస్తాయో, తెలుగులో ‘ఇరుముడి’ కూడా అలాంటి అనుభూతిని అందిస్తోందని అన్నారు. తన కుమార్తె మోక్ష కూడా సినిమా చూసి ఎమోషనల్ అయ్యిందని తెలిపారు.

సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని రవితేజ ప్రశంసించారు. పాటలు, నేపథ్య సంగీతం కథలో భావోద్వేగాన్ని మరింతగా పెంచాయని పేర్కొన్నారు. చాలా కాలంగా థియేటర్లకు దూరంగా ఉన్న ప్రేక్షకులు సైతం ‘ఇరుముడి’ కోసం థియేటర్లకు వస్తున్నారని తెలిసి ఎంతో ఆనందంగా ఉందన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. తన గత చిత్రాలు ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ తనను ప్రేక్షకుల ఇళ్లకు చేరువ చేశాయని, కానీ ‘ఇరుముడి’ తనకు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కల్పించిందని రవితేజ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. కమర్షియల్ అంశాలకంటే ప్రేక్షకులతో భావోద్వేగంగా కనెక్ట్ కావడానికే ఈ సినిమాను రూపొందించామని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. విడుదలైన సుమారు ఒకటిన్నర రోజుల్లోనే సినిమా లాభాల్లోకి ప్రవేశించడం ఆనందంగా ఉందన్నారు. గత 50 ఏళ్లలో ఇలాంటి విజయం, ఇలాంటి రికార్డులు చూడలేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.