యశ్ 'టాక్సిక్' సినిమా ఈవెంట్‌లో ప్రమాదం

Select Suryaa Now

ఫ్లడ్ లైట్ స్తంభం కూలి ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన 'టాక్సిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ హీరో యశ్ హాజరవ్వడంతో అభిమానులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు.

కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లడ్ లైట్ స్తంభం కూలిపోవడంతో అక్కడున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, నిర్వాహకులు గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో కాసేపు వేదిక వద్ద గందరగోళం నెలకొన్నప్పటికీ, పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.