అమెరికా తీరుపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్ర అసంతృప్తి

Select Suryaa Now

స్వేచ్ఛా వాణిజ్య పరిమితుల ప్రతిపాదనపై ధ్వజమెత్తు
ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే కెనడా హక్కులను పరిమితం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ప్రతిపాదించిన నిబంధనలు ఆమోదయోగ్యంగా లేవని ఆయన స్పష్టం చేశారు.

గడిచిన ఏడాది కాలంలో కెనడా సాధించిన ఆర్థిక పురోగతిని ప్రస్తావిస్తూ.. దాదాపు 20 కొత్త ఒప్పందాలు, ఆర్థిక-భద్రతా భాగస్వామ్యాల ద్వారా తమ మార్కెట్ ప్రాప్యతను రెట్టింపు చేసుకున్నామని ఆయన గుర్తుచేశారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని (Free Trade) గట్టిగా విశ్వసించే కెనడాకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రాధాన్య భాగస్వామిగా ఉన్నాయని, అయితే అమెరికా ఈ పరిధిని కుదించాలని చూడటం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పంద భాష లేదా షరతులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మార్క్ కార్నీ తేల్చిచెప్పారు.